వరద బాధితుల సహాయార్థం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందజేసింది. బ్యాంకు చైర్మన్ వై.శోభ గారు, జనరల్ మేనేజర్లు చంద్రశేఖర్ గారు, లక్ష్మి గారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు సుశాంత్ గారు, జి.వి.రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి @revanthofficial గారిని సచివాలయంలో కలిసి ఆ మేరకు రూ. 50,00,000/- ల చెక్కును అందించారు.